Sunday, March 15, 2009

ఈ విధంగా ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.రెండవ భాగం.





ఈ విధంగా ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.మొదటి భాగం.








Wednesday, January 7, 2009

వి ఐ పి పార్టి ప్రారంభోస్వవ ఆహ్వానం --రెండవ భాగం

కారణజన్ముల్లారా!నా దేశప్రజల్లారా! పిచ్చివాడు రాయితోకొడితే,తలకాయపగులుతుంది.అందమైనఅమ్మాయి అందంతో కొడితే,గుండెకాయ పగులుతుంది.ఒక మంచి వ్యక్తి తన మేధస్సుతే కొడితే ఎమౌ తుంది? దేశంలో పేదరికం సచ్చి రేపటికి రెండో రోజు అవుతుంది. నిరుద్యోగం సౌరవ్యవస్త అవతలకు విసిరి వేయబడుతుంది.అభివౄద్ది ఆకాశం ఎత్తుకు ఎదుగుతుంది.మరి మూర్ఖులు అధికారంలో ఉంటె ఏమౌతుంది? ఎక్కడవేసిన గొంగళి అక్కడనే వుంటుంది. యుద్దంలో సింహాల గుంపుకు ఒక గొర్ర్రె నాయకత్వం వహించినట్లుగవుంటుంది. అవినీతి అందలం ఎక్కినట్లుగ వుంటుంది.మన తెలుగులో ఒక మంచి సామెత వుంది.అది గూట్లో రాయితీయలేనివాడు ఈట్లో రాయిని తీయడానికి వెళ్ళినాడట. ఆంటే తన ఇంట్లో చిన్న గూటిలో వున్న అతి చిన్న రాయినికూడ మోయలేని వాడు ఎక్కడో ఏట్లో వున్న అతి పెద్ద రాయిని అల మోస్తాడు?అని అర్దం. అయితే మనం ఏట్లోరాయిని అవలీలగ తీయగల్గుతున్నాం. కానీ, గూట్లో రాయిని తీయలేకపోతున్నాం.ఎక్కడో వున్న చందమామదగ్గరకు ఉపగ్రహాన్ని పంపగల్గుతున్నాం.అంతేలేని విశ్వం యొక్క అంతు చూడాలని ప్రయత్నిస్తూవున్నాం.కానీ మన ప్రక్కనే వున్న పేదరికాన్ని పట్టించుకోవడం మానేశాం.నిరుధ్యోగంతో ఇన్ని సంవత్సరాలుగపోరాటంచేస్తున్న,దానిపై విజయంసాధించలేకపోయాం. నేను చిన్నగవున్నప్పుడు భారతదేశం అంటే అభివౄద్దిచెందుతున్న దేశం.నేను డిగ్రీ చదివేటప్పుడు భారతదేశం అంటే అభివౄద్ది చెందుతున్న దేశం.ఇప్పుడు భారతదేశంఅంటే అభివౄద్ది చెందుతున్న దేశం.ఇంకెప్పుడు మన దేశం అభివౄద్ది చెందినదేశంగ మారుతుంది? మనస్సువుంటే మార్గం వుంటుందంటారు.పేదరిక నిర్మూలనే ప్రతి రాజకీయ నాయకుని అంతిమ గమ్యం అనిఅనుకుంటే,వారు వారి గమ్యాన్ని చేరలేరా? ఉధ్యోగాలను సౄష్టించడమే వారి ప్రధాన లక్ష్యంఅనుకుంటే,వారు దేశంలో ఉధ్యోగాల వాన కురిపించలేరా? ఇంకా ఎన్ని రోజులు దేశంలో పేదరికంవుండాలి?ఇంకా ఎన్ని రోజులు దేశంలో పేదలు ఆకలి భాదలను భరించాలి?నా బంగారు కొండల్లారా! నా జాతిరత్నాల్లారా! మీ మేధస్సుకు పదును పెట్టండి. దేశంలో వున్న ప్రతి సమస్స్యకు పరిష్కారం చూపడమేమన ప్రధాన లక్ష్యం దేశంలోని ప్రతి వ్యక్తిని VIP మార్చడమే మన ద్యేయం ,మన గమ్యం మన దేశాన్నిప్రపంచంలో నెంబర్ వన్ చేద్దాం.తద్వారా చరిత్రలో మనకో పుటను కేటాయించుకుందాం.అందులో మన కీర్తినిసువర్ణక్షరాలతో లిఖించుకుందాం.జిందాబాద్,జిందాబాద్,vip party జిందాబాద్.ZNB,ZNB,vip party ZNB ఇట్లు
సదా మీ సేవలో, మీ సుపరిపాలసింహ
(ప్రముఖరాజకీయవేత్త,vip party అధ్యక్షుడు)